ప్రపంచానికి చోదకంగా భారత్ అభివృద్ధి
వ్యాపారాలకు భారత్‌లో అపార అవకాశం
ఆస్ట్రియా పెట్టుబడిదారులకు మోదీ పిలుపు
ఆస్ట్రియా చాన్స్‌లర్, అధ్యక్షుడితో చర్చలు
న్యూఢిల్లీ, జూలై 10: భారత్‌లోని అపార వ్యాపార, వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు పెట్టుబడులతో రావాలని ఆస్ట్రియా వ్యాపారవేత్తలను ప్రధాని నరేంద్రమోదీ కోరారు. భారత ఆర్థిక వ్యవస్థ నేడు ప్రపంప ఆర్థిక వృద్ధికి చోదకశక్తిగా మారిందని తెలిపారు. బుధవారం ఆస్ట్రియాలో పర్యటించిన ఆయన.. ఆ దేశ చాన్స్‌లర్ కార్ల్ నెహమ్మర్, అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్‌డెర్ బెల్లెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వియన్నాలో మోదీకి ఆస్ట్రియా సంప్రదాయంలో ఘన స్వాగతం లభించింది.
అనంతరం దైపాక్షిక చర్చల్లో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక శక్తి, హైడ్రోజన్, వాటర్, వ్యర్ధాల నిర్వహణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో పరస్పర సహకరించుకోవాలని నిర్ణయించారు. చర్చల అనంతరం మోదీ, నెహమ్మర్ మీడియాతో మా ట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించేందుకు శాంతి దూతలుగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ యుద్ధానికి అర్థమే లేదని, ఈగో ను సంతృప్తి పరుచుకొనేందుకే ఈ మారణహోమం మొదలైందని ఆస్ట్రియా చాన్స్‌లర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రియాలో ఒకరోజు పర్యటన ముగించుకొన్న ప్రధాని మోదీ తిరిగి స్వదేశం చేరుకొన్నారు.
సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ..
ఇండియాను ‘ఫ్రెండ్’, ‘పార్ట్‌నర్’ అని ఆస్ట్రియా చాన్స్‌లర్ నెహమ్మార్ ట్వీట్ చేశారు. ఇండియాతో ధృడమైన సంబంధాల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.