06-04-2025 12:22:08 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 5: భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చితేనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు పరిరక్షణ ఉంటుందని ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు, న్యాయవాది తమిళ-నాడు ఎంపీ విల్సన్ అన్నారు. బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరే-షన్, ఆల్ ఇండియా ఓపిసి స్టూడెంట్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక న్యాయా-నికి 42శాతం బీసీ రిజర్వేషన్లు దిక్సూచి అనే అంశంపై శనివారం హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో సదస్సు జరిగింది.
ఈ సదస్సుకు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టీ. చిరంజీ-వులు అధ్యక్షత వహించగా ఎంపీ విల్సన్, ఆల్ ఇండియా ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, మాజీ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్, ప్రముఖ డాక్టర్ పుంజాల వినయ్ కుమార్, ఓబీసీ లాయర్స్ జేఏసీ చైర్మన్ రాజు, దేవరాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఎంపీ విల్సన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి అనుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చే పాలసీలను చట్టాలను కోర్టులు కొట్టివేయలేవని ఆయన వివరించారు. రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం వల్లనే ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు. ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య మాట్లాడుతూ జీవోల ద్వారా రిజర్వేషన్లు నిలవని అన్నారు.
రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పొందుపరిస్తేనే రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత వస్తుందన్నారు. మాజీ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ శాస్త్రీయ ఆధారా-లతో కూడిన కులగణన లెక్కలు చట్టాలు లేకుండా జీవోలు తెస్తే కోర్టులు కొట్టివేశాయని చెప్పారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ఉద్యమకారులు, సంఘాలు వివిధ రాజకీయ పార్టీల బీసీ నేతలందరూ ఏకమై బీసీల రిజర్వేషన్లు అమలుకై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీ-వన్ రామ్ చిత్రపటనికి పూలమాల లేసి నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో బీసీ ఇంటలె క్చు-వల్స్ కోర్ కమిటీ సభ్యులు సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకూర రాజు, కె వి గౌడ్, కోలా జనార్దన్, అవ్వారు వేణు, కొండల గౌడ్, బొమ్మ రఘురాం, ఒంటెద్దు నరేందర్, కిరణ్, వీర-స్వామి, శ్రీకాంత్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.