calender_icon.png 22 February, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలు ఆత్మగౌరవాన్ని చాటాలి

21-02-2025 01:16:54 AM

 జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకే ఓటు వేసి బీసీ లు తమ ఆత్మగౌరవాన్ని చాటుకోవాలని, బీసీ ఎమ్మెల్సీలైతే రానున్న ఎన్నికల్లో బీసీల కు ముఖ్యమంత్రి పీఠం దక్కడం ఖాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

బీసీ ఉపాధ్యాయ సంఘం డైరీని గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. శ్రీనివాస్‌గౌడ్ మా  ఎమ్మెల్సీ ఎ న్నికల్లో ముగ్గురు బీసీ అభ్యర్థులు గెలిచి రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చ బోతున్నట్టు తెలియజేశారు.

కార్యక్రమంలో బీసీ టీచర్స్ యూని  అధ్యక్షుడు సుంకరి శ్రీ నివాసరావు, బీ  మేధావుల ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ టీచర్స్ యూని యన్ నాయకులు వీరప్ప, గోపాలకృష్ణ, సింగం నగేష్, బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రమ పాల్గొన్నారు.