మునగాల: బీసీ రాజ్యాధికారం కోసం పార్టీలకు అతీతంగా కుటుంబ సమేతంగా ప్రతి గడపగడప కదలి రావాలని సూర్యాపేట జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పొనుగోటి రంగా అన్నారు. మండల కేంద్రంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అగ్రవర్ణాల వెన్నులో వణుకు పుట్టేలా బీసీ కుటుంబాల మహా సమ్మేళనం ఉంటుందని అన్నారు. బీసీల రాజ్యాధికారం సాధించేందుకు, బహుజనులే రాజ్యం ఏలేందుకు రాజకీయ యుద్ధభేరికి బీసీలు కదలి రావాలని పిలుపునివ్వడం జరిగింది. రేపు వరంగల్ లోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధభేరి విజయవంతంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన కోరారు.