calender_icon.png 26 December, 2024 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలు రాజకీయాలను శాసించే స్థాయికి రావాలి

15-07-2024 01:37:30 AM

రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కులగణన చేపట్టాలి

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ 

కామారెడ్డి, జూలై 14 (విజయక్రాంతి): ఆకలి అవమనాల తో పాటు జాతి వివక్షను ఎదుర్కొంటున్న బీసీలు రాజకీయాలను శాసించే స్థాయికి రావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతిలో ఆదివారం నిర్వహించిన బీసీ సమగ్ర కులగణన సాధన యాత్ర ప్రారంభో త్సవ సమావేశంలో ఆయన మాట్లాడారు.  రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సిన హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకట్ట వేస్తున్నాయని ఆరోపించారు. బీసీలు ఐక్యంగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదన్నారు. విద్యావంతులుగా ఎదిగినప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలమన్నారు.