24-02-2025 12:29:16 AM
కేసీఆర్‌కు జాజుల శ్రీనివాస్ లేఖ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేయనందున బీసీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి సామాజిక వర్గానికి మద్దతుగా నిలిచిన నేపథ్యంలో బీసీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలంటూ ఆదివారం కేసీఆర్‌కు లేఖ రాశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బీసీలకు అవకాశం ఇవ్వనందున బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అంతా ఏకమై మూడు నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులను బరిలోకి దింపాయని లేఖలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బీసీల కోసం బీఆర్‌ఎస్ కొట్లాడుతున్నట్టుగా ప్రకటించడం అభినందనీయం అని అన్నారు. ఈ క్రమంలో అండగా నిలిచి బీసీలపై మీకున్న చిత్తశుద్ధిని చాటుకోవాలని కేసీఆర్‌ను కోరారు.