calender_icon.png 8 February, 2025 | 10:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు రాజ్యాధికారం దక్కాలి

08-02-2025 01:27:17 AM

  1. జనగణనలో కులగణనను చేర్చాలి
  2. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి
  3. కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌కు ఎంపీ ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): దేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కడంలో తీవ్ర నిర్లక్ష్యం ఎదురవుతోందని.. జనాభాకు తగ్గట్టుగా రాజకీయంగా అవకాశాలు కల్పించాల ని బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గో యెల్‌ను కలిసి బీసీల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.

జనాభాలో కులగణన చేపట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని, బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతీ కులానికి, సామాజికవర్గానికి వారివారి జనా భా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ప్రాతినిథ్యం దక్కాలన్నారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 25 నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు.

బీసీ ఉద్యోగులకు పదోన్నతులు, బీసీల విద్యా, ఉద్యోగాలపై ఉన్న క్రిమీలేయర్ తొలగింపు, బీసీలకు పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా, బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి రూ.2 లక్షల కోట్లతో ప్రతేక అభివృద్ధి పథకం ప్రకటన తదితర అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకుపోయారు.

ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తులపై కేంద్రమంత్రి గోయెల్ స్పందిస్తూ.. బీసీల డిమాండ్లన్నీ న్యాయసమ్మతమైనవేనని.. వీటి పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హామీఇచ్చారు. బీసీ సంక్షేమ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, బోను దుర్గా నరేశ్, కర్రి వేణుమాధవ్, భీమవరపు సురేవ్, రాజు నేత, మణికంఠ ఉన్నారు.