calender_icon.png 20 January, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యమివ్వాలి

20-01-2025 12:06:38 AM

సంగారెడ్డి, జనవరి 19 (విజయ క్రాంతి)/జహీరాబాద్ : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని పలు బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలో ఓ  ప్రైవేట్ హోటల్లో నిర్వహిం చిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. త్వరలో జరగనున్న  స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీసీలు అధిక సంఖ్యలో పోటీ చేసేందుకు ముందుకు రావాలన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో  60 శాతం ఉన్న బీసీలకు  50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బీసీ కుల గణన చేసిన తర్వాతనే రిజర్వేషన్లు ప్రకటించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయకపోతే పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకుడు రాములు, రాములు నేత,  గొల్ల భాస్కర్, విజయ్ కుమార్, ముదిరాజ్ సంఘం నాయకులు శంకర్ ముదిరాజ్,  సత్యనారాయణ.

పద్మశాలి సంఘం నాయకులు గడ్డం జనార్ధన్, జ్యోతి పండాల్, పూల సంతోష్ నాయి బ్రాహ్మణ సంఘం  ప్రభు,సందీప్ కుమార్, రమేష్ బాబు, డా.పెద్దగొల్ల నారాయణ,గౌడ సంఘం నాయకులు విఠల్ గౌడ్,సాగర  సంఘం నాయకులు శంకర్ సాగర్, ఆరెకటిక సంఘం నాయకులు మొగులాజి రాజు,  కిషన్ మల్లేష్ జంగమ సమాజం నాయకులు విశ్వనాథ్ , వడ్డెర సంఘం నాయకులు అశోక్ పాల్గొన్నారు.