calender_icon.png 16 March, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42 శాతం నిధులివ్వాలి

16-03-2025 01:13:17 AM

  1. బీసీ సబ్‌ప్లాన్‌కూ కేటాయించాలి
  2. బీసీ సంఘాలు, మేధావుల విస్తృత స్థాయి సమావేశంలో వక్తలు

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 15 (విజయక్రాంతి): రాష్ట్రంలోని బీసీల సంక్షే మానికి బడ్జెట్‌లో 42 శాతం నిధులు కేటాయించాలని బీసీ సంఘాల నాయకులు, మేధావులు డిమాండ్ చేశారు. కాన్షిరాం జయంతి సందర్భంగా శనివారం బేగంపేటలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య క్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బీసీ సంఘాలు, బీసీ మేధావుల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, టీపీసీసీ ప్రచార కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీసీ ఉద్యమ నాయకులు ప్రొఫెసర్ మురళి మనోహర్, డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, తెలంగాణ విఠల్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, రిటైర్డ్ ఐఏఎస్ చెల్లేటి ప్రభాకర్, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పదేళ్లుగా రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు చేస్తున్న కేటాయింపులపై రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. బీసీలకు జరుగుతున్న కేటాయింపులు ఖర్చు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం జనాభా ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, ప్రభుత్వ కాంట్రాక్టులలో 42 శాతం బీసీలకు కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మాదిరిగానే బీసీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించాలని మూడు తీర్మానాలు చేసి ఆమోదించారు.

జాజుల శ్రీని వాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీల సంఖ్యకు అనుగుణంగా నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్ చెప్పిందని, కానీ గత ఏడాది బడ్జెట్‌లో 20వేల కోట్ల కేటాయించి, అందులో రూ.9,200 కోట్లే ఖర్చు చేశారన్నారు. నిధుల కేటాయింపుపై ఆర్థిక శాఖ మంత్రి భటి విక్రమార్క దృష్టికి తీసుకెళ్తానని మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ చెప్పారు. కేంద్ర ం లో చాతుర్వర్ణ బడ్జెట్ ఉంటుందని, రాష్ట్రంలో కుల బడ్జెట్ ఉంటుందని విశారదన్ మహారాజ్ విమర్శించారు.