calender_icon.png 22 January, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి

07-09-2024 12:59:44 AM

ఎమ్మెల్సీ కోదండరాం

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్సీ కోదండరాం కోరారు. ఈ విషయమై చర్చించేందుకు ఈనెల 9వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించి, బీసీలకు తీరని అన్యాయం చేసిందన్నారు. కులగణనతో సంబంధం లేకుండా త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మరింత విస్తృతంగా చర్చించేందుకే తెలంగాణ జనసమితి అనుబంధ బీసీ జన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.