calender_icon.png 18 April, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ జంతర్ మంతర్‌లో బీసీల గర్జన

03-04-2025 12:00:00 AM

42% రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలి 

ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన బిసిల పోరుగర్జన కు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎంపీలు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు, మధుయాస్కీ గౌడ్, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య, తెలంగాణ నుండి బీసీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ కుల గణనతో  తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, బీసీల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ప్రపంచానికి తెలిసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు విద్యా ఉపాధి రాజకీయ రిజర్వేషన్ల చట్టం 42%కు పెంచి చట్టాన్ని చేయగా. ఆ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించే వరకు పోరాడవ లసిందేనని ఐలయ్య పేర్కొన్నారు. 

పార్లమెంట్లో ఆమేదం పొందే వరకు బీసీలకు అండగా  కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అలాగే దేశవ్యాప్తంగా కుల గణనలో ఓబీసీ రిజర్వేషన్లు కూడా చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి, యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు అశోక చారి, గుండ్లపల్లి సత్యనారాయణ గౌడ్, ఐలయ్య కురుమ, లక్ష్మీ నరసింహ, సర్దార్, బండి గారి వెంకన్న గౌడ్,   రాంప్రభు. సంతోష్, సతీష్, చంద్రశేఖర్,, తదితరు బీసీ నాయకులు పాల్గొన్నారు.