28-03-2025 12:14:54 AM
తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ
ముషీరాబాద్, మార్చి 27: (విజయక్రాంతి): ఏప్రిల్ 2న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే బీసీల పోరు గర్జనను జయప్రదం చేయాలని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ లు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం చిక్కడపల్లిలోని సమన్వయ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42శాతం బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో విద్యా, వైద్యం, ఉపాధి రంగాలలో అమలు చేస్తున్నట్లు అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంటుకు పంపియడాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్ అమలు చేయడం జరిగిందని, అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో కూడా 9వ షెడ్యూల్డ్లో చట్టం చేసేందుకు ఏకగ్రీవ తీర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 2న అన్ని బీసీ కులసంఘాల ఆధ్వర్యంలో పోరు గర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ వ్యాప్తంగా జనగణనలో కులగణన చేయాలని డిమాం డ్ చేశారు.
జోడో యాత్రలో రాహుల్ గాం ధీకి మోకు, లొట్టిని బహుమతిని ఇవ్వడం జరిగిందన్నారు. ఏప్రిల్ 2 న దేశ రాజధాని ఢిల్లీలో సర్దార్ సర్వాయి పాపన్న 315 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మార్చి 31న సికింద్రా బాద్ రైల్వే స్టేషన్‌లో ఉదయం 7గంటలకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం జరిగిందని, బీసీలంతా అధిక సంఖ్యలో తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ పోరు గర్జనలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ పాటు అన్ని పార్టీల ఎంపీలు పాల్గొంటారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సమన్వయ కమిటీ వైస్ చైర్మన్ గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్, బాలగోని వెంకటేష్ గౌడ్, సుగూరి దుర్గయ్య గౌడ్, వి. నాగభూషణం, సింగం నాగేష్ గౌడ్, పోతగాని అయిలేని గౌడ్ పాల్గొన్నారు.