ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): బీసీల సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఎమ్మెల్సీ కవితకు లేదని.. సమస్యల పరిష్కారానికి పోరాడే సత్తా బీసీలకు ఉందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆమె నాయకత్వంలో సమస్యలను పరిష్కరించుకునే ఖర్మ తమకు పట్టలేదని శనివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఏనాడూ మాట్లాడలేదన్నారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే ధ్యేయంగా చేపట్టిన కులగణనతో తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు.
బీఆర్‌ఎస్‌కు బీసీలపై ప్రేమ ఉంటే కులగణనను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించా రు. రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తున్నట్టు కవిత చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదన్నారు. జనవరి 3న బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పడానికి ఆమె ఎవరని నిలదీశారు.