calender_icon.png 8 January, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌తోనే బీసీల అభివృద్ధి

05-01-2025 02:10:30 AM

  • కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తాం
  • పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు 

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాం తి): బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి పట్ల పనిచేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని, కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేసి తీరుతామని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించారని, ఇప్పుడు 42 శాతానికి పెంచేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశా రు.

శనివారం హనుమంతరావు గాంధీభవన్‌లో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడా రు. బీజేపీని విమర్శించే హక్కు బీఆర్‌ఎస్‌కు ఉండొచ్చేమోగానీ, కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు మాత్రం ఆ పార్టీకి లేదన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ అనేక అవకాశాలు ఇచ్చిందని, పీసీసీ అధ్యక్షులుగా కూడా చేసిందని వీహెచ్ తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలోనే బీసీ వర్గాలకు నుంచి పీసీసీ చీఫ్‌గా తనతో పాటు డీ శ్రీనివాస్, కే కేశవరావు, పొన్నాల లక్ష్మయ్య, బొత్స సత్యనారాయణ, ఇప్పుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అవకాశం ఇచ్చిందని వీహెచ్ గుర్తు చేశారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి దామోదరం సంజీవయ్య, మైనార్టీ నుంచి కమాలోద్దీన్‌కు కూడా అవకాశం ఇచ్చారని తెలిపారు.

అదే బీఆర్‌ఎస్ పార్టీలో బీసీలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం తీసుకొచ్చేందుకు ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తే.. తాము పోరాడి సాధించామని, ఇప్పుడు కవిత అక్కడే ధర్నా చేసిందని తెలిపారు. టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారినప్పుడే ప్రజలు ఆ పార్టీకి దూరమయ్యారన్నారు.

బీసీల పట్ల కవిత కపట ప్రేమను ఒలకబోస్తుందని, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఎందుకు బయటపెట్టలేదో సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటికి అమలు చేస్తున్నామని చెప్పారు. మీ కుటుంబంలో ఏవైనా తగాదాలుంటే మీరే చూసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయొద్దని వీహెచ్ హితువు పలికారు.