calender_icon.png 12 February, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీసీల తగిన గుణపాఠం...

11-02-2025 10:46:32 PM

మాజీ మంత్రి జోగు రామన్న..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కుల గణన పేరుతో మరోసారి బీసీలను మోసం చేసిందని, ప్రభుత్వం చేపట్టిన కుల గణన తప్పులు తడకగా ఉందని, కాంగ్రెస్ పుట్టిన నాటి నుండి నేటి వరకు బీసీలను మోసం చేస్తూనే వస్తుందని బీసీ సంక్షేమ శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ లోని పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన బీసీలకు అన్యాయం చేకూర్చేలా ఉందన్నారు.

2011 సెన్సెస్ ప్రకారం తెలంగాణలో 3 కోట్ల 50 లక్షల జనాభా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల తడక లెక్క చూపెడుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీసీలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. 42 శాతం బీసీల రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పిస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను అమలు చేయాలని డిమాండ్ చేశారు.