calender_icon.png 6 March, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2028లో సీఎం అయ్యేది బీసీనే

06-03-2025 12:39:13 AM

  • స్థానిక ఎన్నికల్లోనూ బరిలో నిలుస్తాం
  • బీసీ నేత జాజుల శ్రీనివాస్

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 5 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వా దం సత్తా చాటిందని, కాంగ్రెస్, బీజేపీలకు గట్టి పోటీనిచ్చిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు పేర్కొన్నారు.

బీసీ వ్యక్తి 2028లో సీఎం అవుతారని జోష్యం చెప్పా రు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడి యా సమావేశంలో జాజుల మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల వెన్నుల్లో వణుకుపుట్టేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీవాదం పని చేసిందన్నారు.

త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చిరంజీవులు మాట్లాడుతూ తాము మద్దతిచ్చిన టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య గెలిచారని, పూల రవీందర్, సుందర్‌రాజ్ యాదవ్‌కు 5 వేల ఓట్లు వచ్చాయని చెప్పారు.

బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం చేసినా కాంగ్రెస్ అభ్యర్థి గెలవలేదని ఎద్దేవా చేశారు.  సమావేశంలో బీసీ సంఘాల నాయకులు సత్యం, అర్జున్, జానయ్య, విక్రమ్, హరీశ్, శంకర్, మణిమంజరి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.