calender_icon.png 2 April, 2025 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాల ధర్నా

31-03-2025 07:34:43 PM

హైదరాబాద్‌,(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘాలు ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లో ధర్నా చేయనున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొని వారికి సంఘీభావం తెలుపనున్నారు. ఏప్రిల్ 2,3 తేదీల్లో వివిధ పార్టీల నేతలను కాంగ్రెస్ నేతలు కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపుపై మద్దతు కోరనున్నాయి.

ఎల్లుండి నిర్వహించే బీసీ సంఘాల ధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏప్రిల్ 2న జరిగే ధర్నాకు కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బృందం ప్రతినిధులు, వివిధ బీసీ సంఘాల నేతలు రైలులో సోమవారం వేరువేరుగా బయలుదేరి వెళ్లారు. బీసీలకు విద్యా, ఉద్యోగ రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్ ను కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శాసనసభలో బిల్లును ఆమోదించిందన్నారు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ పెంపునకు సుప్రీంకోర్టు పరిధి నుండి మినహాయించి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలన్నారు.