24-02-2025 03:30:11 PM
బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిళ్ల శ్రీనివాస్
మందమర్రి,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకి బీసీ సంక్షేమ సంఘం మద్దతు ప్రకటించింది. ఈ మేరకు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజూల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు జారి చేశారని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిళ్ల శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
విద్యావంతుడు, సామాజిక సేవకుడు అయిన ప్రసన్న హరికృష్ణ తను ఉద్యోగంలో ఉన్న సమయంలో తన వేతనంలో నుండి 30 శాతాన్ని సమాజ సేవకే ఉపయోగించటం, సమాజ సేవ కోసం తన ప్రభుత్వ ఉద్యోగానికి 18సం. ల సర్వీసు ఉండగానే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, పట్టభద్రుల గొంతుకగా శాసనమండలిలో తన వాణి వినిపించే అవకాశం ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. అన్ని కులాలు స్వచ్ఛందంగా వారికి మద్దతు తెలిపి మన బహుజన బిడ్డ అయిన ప్రసన్న హరికృష్ణకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు