పట్టణ అధ్యక్షులు సకినాల శంకర్...
మందమర్రి (విజయక్రాంతి): జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని పట్టణంలో బలోపేతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు సకినాల శంకర్ కోరారు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలో నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా సంఘంలో చేరిన వారిని కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసేందుకు యువత ముందుకురావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన దేవర నవీన్ సంఘంలో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బేర వేణు గోపాలరావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ ప్రభాకర్, ఏదులపురం రాజు, పెండ్యాల గౌతంలు పాల్గొన్నారు.