calender_icon.png 11 October, 2024 | 6:53 AM

ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఆలోచనను విరమించుకోవాలి

11-10-2024 02:14:50 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి): ఇంటిగ్రేటేడ్ గురుకుల ఏర్పాటు ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని మాజీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ ఫ్రంట్ అధ్యక్షులు గొరిగే మల్లేశ్ యాదవ్ అధ్యక్షతన గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశానికి ఆర్ కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలకు 330, ఎస్సీలకు 246, మైనార్టీలకు 206, ఎస్టీలకు 146 గురుకుల పాఠశాలలు ఉన్నాయని, ఇంటిగ్రేటేడ్ వ్యవస్థ తీసుకురావడం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. గతంలో ఒక్కో రెసిడెన్షియల్ గురుకులానికి బడ్జెట్‌లో రూ. 20 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 2,560 మంది పిల్లలకు కేవలం రూ. 20 కోట్లు మాత్రమే కేటాయిస్తుందని, అవి దేనికి సరిపోవన్నారు.

విద్యావ్యవస్థ బలోపేతం కావాలంటే ఐఏఎస్, ఐపీఎస్ తరహాలో ఐఈఎస్(ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్)ను తీసుకురావాలన్నారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అందుకే ఇంటిగ్రేటేడ్ విద్యావిధానాన్ని తీసుకొస్తుందన్నారు.  సమావేశంలో విజయ్ ఆర్యన్, సైదులు, గుజ్జకృష్ణ, మధుసూధన్, నీలం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.