calender_icon.png 8 March, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్క కొమురయ్యకు బీసీ టీచర్ సంఘం మద్దతు

02-02-2025 01:21:52 AM

టీచర్ ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని బీసీలకు పిలుపు

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాం తి): ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల నుంచి బీజేపీ తరఫున టీచర్ ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న మల్క కొమురయ్య కు బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్(బీసీటీఏ) పూర్తి మద్దతు ప్రకటించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు తెలిపారు.

మల్క కొమురయ్య బీసీల అభ్యున్నతి కోసం ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని, బీసీటీఏ సైతం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం పనిచేస్తున్న ఉపాధ్యాయ సంఘమన్నారు. చట్టస భల్లో బీసీలకు తగినంత ప్రాతినిధ్యం లేకపోవడంతో బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. అందుకే బీసీ అభ్యర్థులను ఎక్కువమందిని గెలిపిస్తేనే హక్కులను, ప్రయోజనాలను సాధించుకోగలమన్నారు.