08-02-2025 12:56:13 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేయాలని, జనాభా ప్రాతిపదికను బీసీలకు నిధులు కేటాయించాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కులగణన ద్వారా తమ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తోందని, అందుకే సూర్యాపేటలో రాహుల్‌గాంధీతో సభ పెడుతున్నామని స్పష్టం చేశారు.
గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ చేసినందుకు గజ్వేల్‌లోనూ మల్లికార్జునఖర్గేతో సభ పెడుతున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి బీసీల పక్షపాతి అని, ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టే కులగణనను పూర్తి చేశారన్నారు. బీజేపీకి రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అమిత్‌షా అవమానించారని మండిపడ్డారు.
ఆ విషయంలో ఇప్పటికీ ఆయన క్షమాపణ చెప్పలదేని వాపోయారు. మీడియాతో మాట్లాడి సరిపెట్టకుండా, ప్రజల్లోకి వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని, ఎక్క డ ఎవరికి అన్యాయం జరిగినా తాను అక్కడికి వెళ్లి న్యాయ పోరాటం చేస్తున్నట్టు హనుమంతరావు పేర్కొన్నారు.