31-03-2025 09:56:51 PM
రాష్ట్ర బీసీ యువజన సంఘం కార్యదర్శి ఆనగంటి కృష్ణ..
మునుగోడు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో చేసిన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలనే డిమాండుతో ఢిల్లీలో ఏప్రిల్ 2న చేపట్టబోయే ధర్నాకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి ఢిల్లీకి బీసీ యువజన సంఘం నాయకులతో కలిసి ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి అని వారన్నారు. ఈ కార్యక్రమంలో సురిగి నరసింహ, చెరుకుపల్లి వెంకటయ్య, భాసరాజు యాదగిరి, గోసుకొండ శంకర్, చెరుకు సైదులు, మాధగోని మల్లయ్య, చెరుకు శంకర్, గోసు కొండ మల్లేష్, బత్తుల నాగరాజు, నాతి రాము, కొండూరు మల్లికార్జున్, చికిల మెట్ల నరసింహ, గోస్కొండ కృష్ణయ్య, నాగరాజు, సైదులు, లింగస్వామి ఉన్నారు.