calender_icon.png 19 April, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి

01-04-2025 02:45:52 AM

బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

ముషీరాబాద్, మార్చి 31: (విజయ క్రాంతి) : సమయం వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీ తాను బీసీ అని చెప్పుకోవడం కాదు, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని పార్లమెంటులో వెంటనే ఆమోదించాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు.

ఏప్రిల్ 2న బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్లో జరగబోయే బీసీల మహాధర్నా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సోమవారం బీసీ సంఘాల నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాచాల మాట్లాడు తూ రాహుల్ గాంధీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిందన్నారు.

బీసీల ఆకాంక్షల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని, బీసీలకు భరోసా కల్పించిన రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు బీసీ సమాజం తరపున ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం బీసీల వైపా? అగ్రవర్ణాల వైపా? పేద ప్రజల వైపా? పెట్టుబడిదారుల వైపా? తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.

మాటి మాటికి బీసీ ఎజెండా అనడం కాదు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. బుధవారం జరగబో యే మహాధర్నాకు వచ్చే వారికి ప్రత్యేక రైలు సదుపాయం, భోజనం, వసతి సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, జాతీయ ఓబీసీ మేధావుల ఫోరం అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ, జైగౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షులు వట్టికూటి రామారావు గౌడ్, ఓబీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షులు కిరణ్ కుమార్, పరికిపండ్ల అశోక్, బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు బడేసాబ్, చింతపల్లి సతీష్, వివి.గౌడ్, అంజన్న యాదవ్, దేవర శివ, రాఘవేందర్, బిక్షపతి, రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.