31-03-2025 01:22:49 AM
బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్ నిసాని రామచంద్రం డిమాండ్
సిద్దిపేట, మార్చి 30 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లను 46 నుండి 56 శాతానికి పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్ నిసాని రామచంద్రం డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు బీసీల వ్యతిరేక పార్టీలన్నారు. ఈ దేశంలో మొట్టమొదటిసారి బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడిన వ్యక్తి బిఎస్పీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్సిరాంకే దక్కిందన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బీఎస్పీ కార్యకర్తలతో సుమారు రోజు 15,000 మందితో సుమారు నెలరోజుల పాటు అప్పటి కేంద్ర ప్రభుత్వం విపీ సింగ్ పైన ఒత్తిడి తీసుకొచ్చి బీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చిన వ్యక్తి కాన్షిరాని తెలిపారు.
బీసీల పక్షపాతిగా ఉన్న ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ మాత్రమేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల వెంకట్, జిల్లా అధ్యక్షుడు కటికల ఓం ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్ల మల్లేశం ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల శంకర్, జిల్లా కార్యదర్శి కొండన్నల నరేష్ , జిల్లా సభ్యులు గజ్జల తిరుపతి మౌర్య, సిద్దిపేట అసెంబ్లీ అధ్యక్షుడు పుల్లూరు ఉమేశ్, అసెంబ్లీ ఇన్చార్జి పంగబాబు, హుస్నాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు వేల్పుల రాజు, ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, దుబ్బాక అసెంబ్లీ అధ్యక్షుడు పోతారం రాజు, మోత నర్సింలు, గజ్వేల్ అసెంబ్లీ అధ్యక్షుడు చంద్రం, నాయకకులు సంపత్ , బాబు, ప్రసాద్, దెబ్బేట యాదగిరి, రవీందర్, కిరణ్, నాగరాజు, ఖాతా మహేష్, బాబు, ఆశని కనక ప్రసాద్, యాదారి నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.