calender_icon.png 4 February, 2025 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఇవ్వాలి

04-02-2025 01:58:25 AM

* నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ వీజీఆర్ నారగోని

ముషీరాబాద్, ఫిబ్రవరి 3: విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 25 నుంచి 44 శాతానికి పెంచుతూ వెం  జీవో జారీ చేయాలని నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ వీజీఆర్ నారగోని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీజీఆర్ నారగోని మాట్లాడుతూ గతంలో బీసీ జనాభా లెక్కలు లేనందున రిజర్వేషన్లను పెంచలేదని.. ఇప్పుడు తప్పించుకొనే ప్రసక్తి లేదన్నారు.

స్థానిక సంస్థల రిజర్వేషన్‌లను బీసీలకు 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో ప్రకటన చేసి జీవోను జారీ చేయాలని, అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపడం వల్ల ఉపయోగం లేదన్నారు. సమావేశంలో ఫ్రంట్ కన్వీనర్లు కేబీ శ్రీధర్, జేఏ ఆశీర్వాదం, ఎంబీ గోపి, సలీం బాషా, పీ పాల్, స్వామీజీ రాజులు, సూర్యనారాయణ పాల్గొన్నారు.