calender_icon.png 23 October, 2024 | 11:18 PM

బీసీ రిజర్వేషన్లు పెంచాలి

23-09-2024 12:00:00 AM

ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

అఖిలపక్ష సమావేశంలో వక్తలు

ముషీరాబాద్, సెప్టెంబర్ 22: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని 30 బీసీ సంఘాలు, బీసీ ఉద్యోగ సంఘాలు, 80 కుల సంఘాలు డిమాండ్ చేశాయి. రిజర్వేషన్లు పెంచే వరకు ఎన్నికలు జరగనివ్వమని సంఘాల బాధ్యులు హెచ్చరించారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో తెలంగాణ బీసీ సంక్షేమ సం ఘం కన్వీనర్ లాల్‌కృష్ణ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, పలు కుల, బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలని అన్నారు. 2028లో కచ్చితంగా రాష్ట్రం లో బీసీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వీహెచ్ మాట్లాడుతూ.. కులగణనతోనే బీసీలకు సముచిత న్యాయం జరుగు తుందని అన్నారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంక టేశ్ ముదిరాజ్, రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షుడు జయంత్ రావు, యాదవ సంఘం అధ్యక్షుడు రాములు, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జగన్ మోహన్, జాతీ య వడ్డెర సంఘం అధ్యక్షుడు వేముల వెంకటేశ్, నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పీ శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.