calender_icon.png 24 January, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లు పెంచాలి

05-07-2024 12:48:42 AM

కేంద్ర మంత్రికి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వినతి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): జనాభాకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో  బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌ను రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కోరారు. ఆయనతో పాటు బీసీ సంఘం ప్రతినిధులు నీలం వెంకటేశ్, భూపేష్ సాగర్, అర్జున్ సింగ్, రాజ్ కుమార్ తదితురులు నగరంలో గురువారం కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం సమపర్పిం చారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. 2012, 2018లో పలు రాష్ట్రాల హైకోర్టులు బీసీ రిజర్వేషన్లు తగ్గించాలని తీర్పు చెప్పిన నేపథ్యంలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను పెంచేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని కోరారు.

ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత లేనందున తరుచూ వివిధ రాష్ట్రాల హైకోర్టులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లకు 50 శాతం సీలింగ్ అనేది కేవలం విద్యా, ఉద్యోగాలకే పరిమితం అని అన్నారు. రాజకీయ రిజర్వేషన్లకు సీలింగ్ విధించడం పట్ల హేతుబద్దత లేదన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టి న తర్వాతనే మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని గుర్తు చేశారు. అగ్ర కులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేసినప్పుడు ఇదే సుప్రీంకోర్టు 50% సీలింగ్ సబబు కాదని చెప్పిన తీర్పు ఉన్నట్టు తెలియజేశారు. తక్షణ మే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్ట బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నాయకులు కోరారు.