calender_icon.png 15 January, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లు పెంచాలి

14-07-2024 06:05:27 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య 

ముషీరాబాద్, జూలై 13: పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6న చలో పార్లమెంట్ నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన బీసీ కోర్ కమిటీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని అన్నారు. కేంద్ర స్థాయిలో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని, జనాభా లెక్కల్లో బీసీ కులాల వారి లెక్కలు సేకరించాలని కోరారు. సమావేశంలో బీసీ విద్యార్థి నాయకులు ప్రవీణ్, విశాల్, లోకేష్, శ్రీధర్, రోహిత్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.