12-04-2025 12:57:16 AM
ఎమ్మెల్సీ ప్రొ. కోదండరామ్
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల సాధనకు ఫూలే ఆశయాలే ఆదర్శమని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొ. కోదండరామ్ తెలిపారు. మహాత్మా జ్యో తిబా ఫూలే 198వ జయంతిని నాంపల్లిలోని తెలంగాణ జన సమితి కార్యాల యంలో బీసీ జన సమితి అధ్యక్షుడు జస్వంత్ కుమార్ అధ్యక్షతన ఘనం గా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరామ్ హాజరై ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, మాట్లాడారు. అసమానతలు లేని సమాజం కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి ఫూలే అని కొనియాడారు. విద్య ద్వారా నే సమాజ మార్పు సాధ్యమని గ్రహించి, తన సతీమణికి విద్యనేర్పి మొట్టమొదటి భారత మహిళా టీచర్‌గా నిలబెట్టారని చెప్పారు.