28-03-2025 06:18:21 PM
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ రూప్ నార్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్(BC Reservations) అమలుకు ఏప్రిల్ 2న ఢిల్లీలో జరిగే బీసీల పోరుగర్జన(BC Poru Garjana)ను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రమేష్ రూపనార్ పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘ కార్యాలయం(BC Welfare Association Office)లో బీసీ ల పోరుగర్జన పోస్టర్లను ఆవిష్కరించారు. భారత ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ లు ఎవరు ఇచ్చే భిక్షం కాదని, ఇది బీసీల సామాజిక హక్కు అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి జిల్లా అధ్యక్షుడు లోబడే లహు కుమార్, బీసీ రైతు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వైరగడే మారుతి పటేల్, అఖిలభారత మాలి మహా సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగోసె శంకర్, బీసీ సంక్షేమ సంఘ నాయకులు ఎసయ్య, శెండే రాజు పటేల్ తదితరులు పాల్గొన్నారు