calender_icon.png 6 February, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరిగిన బీసీ జనాభా

06-02-2025 01:14:49 AM

లెక్క తప్పలే..

  1. పారదర్శకంగానే కులగణన సర్వే 
  2. విపక్షాల తప్పుడు ప్రచారాలు 
  3. వాటిని ప్రజలు నమ్మొద్దు 
  4. కులగణన లెక్కల ఆధారంగా సంక్షేమ పథకాలు 
  5. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  6. సర్వేపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ప్రజాప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే పూర్తిగా  శాస్త్రీయబద్ధంగా, పారదర్శకంగా జరిగిందని, 2011 జనాభా లెక్కల తర్వాత అత్యంత పకడ్బందీగా నిర్వహించిన సర్వేఅని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

గతంతో పోలి స్తే రాష్ట్రంలో బీసీ జనాభా పెరిగిందని, విపక్షాలు తప్పుడు గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్త న్నాయని మండిపడ్డారు. కులగణన సర్వేపై బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రి ఉత్తమ్.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాక ర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..  గతంలో ప్రామాణిక కుల ఆధారిత డేటా సేకరించలేదని తెలిపారు. గత అధ్యయనాలు అసంపూర్ణంగా, అనధికారికంగా ఉండగా, తాము చేపట్టిన సర్వే చట్టబద్ధమైన, పూర్తి వివరాలతో కూడిన మొదటి కుల సర్వే అని పేర్కొన్నారు. వివిధ వర్గాల సామాజిక, -ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి, సంక్షేమ విధానాలను రూపొందించడానికి ఈ ఫలితాలు ఉపయోగపడతాయన్నారు.

బీఆర్‌ఎ స్ పాలనలో 51.09% గా నమోదైన బీసీ జనాభా ఇప్పుడు 56.33 శాతానికి పెరిగిందన్నారు. ఎస్టీల జనాభా 9.8 శాతం నుంచి 10.45 శాతానికి, ఓసీల జనాభా 21.55 శాతం నుంచి 15.79 శాతానికి తగ్గిందని మంత్రి వివరించారు. అయితే బీసీ జనాభా శాతం తగ్గిందని విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని అందులో వాస్తవం లేదన్నారు.

బీసీ జనాభాపై నిజమైన అధ్యయనం చేయకపోతే, విపక్షాలు ఏ గణాం కాలను ఆధారంగా తీసుకొని ప్రస్తుత సంఖ్యలను పోలుస్తున్నారో చెప్పాలని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. కచ్చితత్వంతో సర్వేను నిర్వహించేందుకు లక్ష మందికి పైగా శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లను నియమించినట్లు చెప్పారు.

రాష్ట్రాన్ని 94,261 ఎనూ ్యమరేషన్ బ్లాక్‌లుగా విభజించి, ప్రతీ బ్లాక్‌కు సుమారు 150 గృహాలను కవర్ చేసేలా మార్క్ చేసినట్లు వివరించారు. 50 రోజుల్లో సర్వే పూర్తయిందని, పట్టణాలు విస్తరించడంతో పాటు వలసలు ఉండటంతో కొత్తగా ఎన్యూమరేషన్ బ్లాక్స్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. రెండు దశల్లో జరిగిన సర్వేలో మొదటి దశలో ఇళ్లను గుర్తించామని, రెండో దశలో ప్రధాన డేటాను సేకరిం చినట్లు చెప్పారు.

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా  సర్వేలో పాల్గొనడం ప్రామాణికతకు అద్దం పడుతోందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ సర్వే భవిష్యత్తులో సమర్థవంతమైన పాలన అందించేందుకు దోహదపడు తుందన్నారు. సర్వే అనంతరం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్  ఆధ్వర్యంలో ఆధునిక సాఫ్ట్‌వేర్ సాయంతో డేటా విశ్లేషణ చేపట్టినట్లు చెప్పారు.

76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించి, 36 రోజుల్లో డేటాను డిజిటలైజ్ చేశారని పేర్కొన్నారు. ‘దోషాలను గుర్తించడానికి ఆటోమేటెడ్ ఎర్రర్ డిటెక్షన్ మెకానిజాన్ని ఉపయో గించాం. ఓటర్ల జాబితాలు జనాభాను అం చనా వేసేందుకు ఉపయోగపడవు. వాటికి ఆధార్ అనుసంధానం లేకపోవడంతో కచ్చితమైన గణాం కాలు ఇవ్వలేవు.

గత ఎన్నికల్లో బీసీ ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకున్నప్పటికీ, అది బీసీ జనాభా గణనకు సరైన ఆధారంగా ఉండదు’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కొందరు వ్యక్తిగత సమాచారం ఇవ్వకపోయినా, ప్రభు త్వానికి ఇప్పుడు తెలంగాణ గృహాల సమగ్ర డేటాబేస్ ఉందన్నారు.

కార్యక్రమంలో ఎంపీ  మల్లు రవి, ఎమ్మెల్సీలు  కోదండరాం, బ ల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు పద్మావతి, వేముల వీరేశం, మందుల సామేల్, వీర్లపల్లి శంకర్, అమీర్‌అలీ ఖాన్, లక్ష్మీకాంత్‌రావు, భూపతిరెడ్డి, వెడ్మ బొజ్జు, కుంభం అనిల్‌రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.