calender_icon.png 7 February, 2025 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్‌లో బీసీ జనాభా 63 శాతం

07-02-2025 12:41:33 AM

  1. అంతకంటే ఎక్కువ జనాభా ఉన్నా తెలంగాణతో మాత్రం తక్కువ చేసి చూపిస్తున్నారు
  2. బీజేపీ రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణన సర్వే పూర్తి అశాస్త్రీయంగా ఉందని.. 134 బీసీ కులాలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు. బీహార్‌లో బీసీ జనాభా 63 శాతంగా ఉందని...

అంతకంటే బీసీ జనాభా అధికంగా ఉన్న తెలం గాణలో మాత్రం వారి సంఖ్యను తక్కువగా చూపించడం అన్యాయమన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడా రు. రాష్ట్రంలో బీసీల జనాభా 46.25 శాతమేనంటూ చూపిస్తూ, వారి హక్కులను హరించే కుట్ర జరుగుతుందన్నారు.