calender_icon.png 17 November, 2024 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రాజకీయ పార్టీ రావాలి

15-09-2024 01:31:35 AM

బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల 

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన అగ్రకుల పార్టీలు బీసీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని.. అందుకే బీసీలు ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లో బహుజన ముక్తి పార్టీ సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. రాష్ట్రంలో అధికా రం రెండు, మూడు కులాలకే పరిమితమైందన్నారు.

బీసీ సీఎం ఎజెండా గా వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకొని వెళ్లాలని పిలుపు నిచ్చారు. బీసీలంతా ఏకమై గోల్కొం డ కోట మీద బీసీ జెండా ఎగరేస్తామ ని ధీమా వ్యక్తం చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీలకు ఒరిగే దేమీ లేదని, పార్టీలన్నీ కేవలం ఓటు బ్యాంకు కోసమే, జెండాలు మోసే కార్యకర్తలుగానే బీసీలను చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల కు రాజకీయ సాధికారత లభించాలంటే, రాజకీయ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.