తెలంగాన బీసీ జేఏసీ కన్వీనర్ కళ్యాణం రవి
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): ఫిబ్రవరి 2న హలో బీసీ చలో వరంగల్ బీసీ రాజకీయ యుద్ధభేరికి బీసీలందరూ తరలి రావాలని తెలంగాణ బీసీ జేఏసీ కన్వీనర్ కళ్యాణం రవి(Telangana BC JAC Convener Kalyanam Ravi) పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని ఐబీ విశ్రాంత భవన్ లో బీసీ రాజకీయ యుద్ధ భేరి పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీ లకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందన్నారు. తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఇప్పటికైనా బీసీ ల డిమాండ్స్ నెరవేర్చుకోవాలన్నారు.స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్స్ కల్పించాలన్నారు.ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్స్ రద్దు చేయాలన్నారు.బీసీ ల రక్షణ కు అట్రాసిటీ చట్టం తీసుకురావాలన్నారు.ఫీజు రియింబర్స్మెంట్, పరిశ్రమల స్థాపనకు సహకరించాలన్నారు. అంతేకాకుండా పేద బీసీ లకు ప్రభుత్వ భూములను పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్,గొల్లకూర్మల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజన్న యాదవ్,జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్, నాయకులు పాదం శ్రీనివాస్, జిన్ని వెంకటేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.