భీమదేవరపల్లి, జనవరి 29: ఫిబ్రవరి 2న వరంగల్‌లో జరిగే బీసీ రాజకీయ యుద్ధభేరి విజయవంతం చేయాలని వరంగల్ కుడా మాజీ చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా భీమ మండలం ముల్కనూర్‌లో బుధవారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రాజకీయ యద్ధబేరికి లక్షల్లో తరలివచ్చి విజయవంతం చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్నారు.
కార్యక్రమంలో నాయకులు వంగ రవిందర్, అశోక్‌ముఖర్జీ, గద్ద సమ్మయ్య, గద్ద సంపత్, గిరబోయిన రాజయ్య, డాక్టర్ ఎదులాపురం తిరుపతి, సంగ సంపత్, దార్న శ్రీను, గుడికందుల పూర్ణచందర్, జక్కుల రాజు, మండల సురేందర్, డాక్టర్ సుధాకర్, ఊసకోయిల ప్రకాశ్, ఆదరి రవి, దొంగల కొంరయ్య, పృథ్వీరాజ్, కూన యాదగిరి పాల్గొన్నారు.