calender_icon.png 1 November, 2024 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ తరహాలోనే బీసీ ఉద్యమం

10-08-2024 05:39:21 PM

హనుమకొండమాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జరిగిన బీసీ సత్యాగ్రహ దీక్షలో పాల్గొని మాట్లాడుతూ...  తెలంగాణ తరహాలోనే బీసీ ఉద్యమం చేద్దామని, గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉద్యమం జరగాలని అన్నారు.  గ్రామ స్థాయిలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమానికి అందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు. బీసీ కుల గణన వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీ కుల గణన అనంతరమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్ లు అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ రెండు బీసీ లను ఓటు బ్యాంకు గానే చూస్తున్నాయని ఆరోపించారు. బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని బీసీ సంఘాలు ఏకం అయి రాష్ట్రంలో బీసీ కుల గణన జరిగే వరకు పోరాడుదామన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జరిగిన బీసీ సత్యాగ్రహ దీక్షకు పశ్చిమ బీసీ నాయకులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, బీసీ నాయకులు పులి రజినీకాంత్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ కుసుమ లక్ష్మీనారాయణ, నార్లగిరి రమేష్, మట్టపెల్లి రమేష్, నాయకులు కనక రాజు, జానకి రాములు, కుచన సునీల్, తాడిశెట్టి క్రాంతికుమార్, రాజు, మహేష్, రఘు, అశోక్, రామ్ మూర్తి, రాజు, బీసీ విద్యార్థి నాయకులు గండ్ర కోట రాకేష్ యాదవ్, శ్రీకాంత్ చారి, వీరా స్వామి, ప్రణయ్, రాకేష్, వాసు, వివేక్ తదితరులు పాల్గొన్నారు.