22-03-2025 08:06:58 PM
బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ కార్యనిర్వహక అధ్యక్షులు కుడికాల భాస్కర్..
మందమర్రి (విజయక్రాంతి): జనాభాలో సగ భాగం పైన ఉన్న బీసీలు విద్యా వైద్యం ఆర్థిక రాజకీయ అని రంగాల్లో వెనుకబడి ఉన్నారని వెనుకబడిన బీసీల అభివృద్ధి లక్ష్యంగా పల్లె పల్లెలో బీసీ ఉద్యమాన్ని ఉదృతం చేస్తున్నామని బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు కుడికాల భాస్కర్ స్పష్టం చేశారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలను సంఘటితం చేసి గ్రామ గ్రామాన సంస్తాగతంగా నిర్మాణం చేసి బీసీల ఉద్యమ పోరాటాన్ని బలోపేతం చేసి ప్రతి పల్లెలో బీసీ జెండాను ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జనాభాలో 52 శాతానికి పైగ ఉన్న బీసీలు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని వారిని అభివృద్ధి చేయడమే దేశ అభివృద్ధి అవుతుందని అన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన వాటా, చట్ట సభల్లో రిజర్వేషన్ల సాధన, దేశ వ్యాప్త కుల గణన, బీసీ అట్రాసిటీ చట్టాలు సాధించి వరకు నిరంతరం పోరాడుతామన్నారు. రాజీలేని ఉద్యమాల ద్వారా బీసీల హక్కుల సాధనే తమ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి సాగర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి జినుకల లక్ష్మణరావు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గజెల్లి మనోహర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిలుకమర్తి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
బీసీ ఆజాది ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా చిదురాల సతీష్ బీసీ ఆజాది ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా పట్టణానికి చెందిన శిబిరాల సతీష్ ను నియమిస్తూ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుడికాల భాస్కర్ నియామక పత్రాన్ని సతీష్ కు అందజేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి జిల్లాలో బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసి బీసీల సంఘటితం కోసం నిర్విరామంగా కృషి చేస్తానన్నారు.