calender_icon.png 4 April, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ మహాధర్నాను విజయవంతం చేయాలి

02-04-2025 12:00:00 AM

ముషీరాబాద్, ఏప్రిల్ 1: (విజయక్రాంతి) : తెలంగాణలో ఆమోదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో  ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న బీసీ మహాధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మాదేశి రాజేందర్ పిలుపునిచ్చారు.

ఈ మేరకు మంగళవారం ముషీరా బాద్ నుంచి ఢిల్లీలో జరిగే బీసీ మహాధర్నాకు పెద్ద ఎత్తున బీసీ కులసంఘాల నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా మాదేశి రాజేందర్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సారధ్యంలో నిర్వహిస్తున్న మహా ధర్నాకు నగరం నుంచి పెద్ద ఎత్తున బీసీలు తరలివెళ్తున్నట్లు పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. త్వరలో నిర్వహించనున్న జనగణనతో పాటు బీసీ కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా కమిటీ అధ్యక్షురాలు కళావతి, నాయకులు సాయి, రాజేష్, ప్రణీత్, నాగరాజు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.