calender_icon.png 6 January, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని పార్టీలకు బీసీలే ఎజెండా!

04-01-2025 02:02:18 AM

  1. కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ స్లోగన్
  2. మెజారిటీ ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం

హైదరాబాద్, జనవరి 3(విజయక్రాంతి): రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ మెజారిటీ ఓటర్ల మనసులను గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎప్పుడులేని విధంగా అన్ని పార్టీలు బీసీలనే ఎజెండాగా చేసుకు న్నాయి. వెనుకబడిన తరగతుల జపం చేస్తు న్నాయి. బీసీ కులాలే ఎజెండాగా ముందుకు సాగుతున్నాయి.

తెలంగాణ జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాలను ఆక ట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందునుంచే కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన అంశాన్ని ప్రస్తావించింది. ఇప్పు డు కులగణనతో అన్ని పార్టీల్లో ఆందోళన రేకెత్తించింది. బీజేపీ సైతం ఓ అడుగు ముందుకేసి తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రక టించింది.

సూర్యాపేట సభలో హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ నేత, కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి తిరిగి వచ్చాక బీసీలే లక్ష్యంగా రాజకీయాలు ప్రారంభిం చారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీలన్నీ బీసీలపైనే ఫోకస్ చేశాయి.

బీసీలపై కాంగ్రెస్ చూపు..

అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ కులగణన అంశాన్ని ఎత్తుకుంది. తాము అధికారంలోకి వస్తే బీసీలకు జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. మాట ఇచ్చిన ట్లుగానే రాష్ట్రంలో కులగణన చేపట్టింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రిజర్వే షన్ల అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టింది.

మరోవైపు బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పేందుకు బీసీ అయిన మహేశ్‌కుమార్ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షునిగా నియమించి  రేసులో ముందు నిలిచింది. బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే అది తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన తీన్మార్ మల్లన్న కూడా బీసీ ఎజెం డాతో సభలు, సమావేశాలు నిర్వహించారు. రాజ్యాధికారంలో బీసీలకు జరుగు తున్న అన్యాయాన్ని మల్లన్న ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంపైనా విమర్శలు చేసినట్లు కనబడినా క్రమంగా మెత్తబడ్డారు. 

బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటూ..

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీల ఎజెండాగా బీజేపీ సైతం రాజకీయం ప్రారంభించిం ది. తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎంగా చేస్తామని బీజేపీ ప్రకటించింది. అయితే ఆ పార్టీ ఊహించని విధంగా కేవలం 8 ఎంపీ స్థానాలకే పరిమితం అయ్యింది. అయితే బీసీని సీఎం చేస్తామన్న బీజేపీ... కనీసం పార్టీ శాసనసభ పక్ష నేతగా కూడా బీసీని పెట్టకపోవడంపై బీసీల్లో పెద్దఎత్తున చర్చ జరిగింది.

బీసీలను బీజేపీ వాడుకుని వదిలేస్తుందా అని పలువురు బీసీ నేతలు వాపోయారు.  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలంటే బీసీ ఎజెండా తప్పనసరి అని ఆ పార్టీ జాతీయ నాయకులు ఓ అంచనాకు వచ్చారని సమాచారం.

అందుకే వైసీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగిన బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను రాజీనామా అనంతరం బీజేపీలోకి ఆహ్వానించి తిరిగి ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు. రాష్ట్రంలో బీసీల పక్షాన 50 ఏళ్లుగా పోరాడుతున్న కృష్ణయ్యకు కేంద్రంలో కీలకమైన పదవి ఇచ్చేందుకు అధిష్ఠానం ఆలోచిస్తున్నదనే చర్చ జరుగుతోంది. 

అజెండా మార్చుకుని ముందుకు..

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి జైలు నుం చి బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత కొ న్నాళ్లు సైలెంట్‌గా ఉన్నా తర్వాత బీసీ ఎజెండాగా రాజకీయం ప్రారంభించారు. తన మానసపుత్రికైన తెలంగాణ జాగృతిని పక్కనపెట్టి బీసీల సమస్యను తలకెత్తుకున్నారు. బీసీ లే లక్ష్యంగా తన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. గతంలో ఏర్పాటుచేసిన ఫూలే ఫ్రంట్ ను మళ్లీ తెరమీదకు తీసుకువచ్చారు.

బీసీ కులగణనలో లోపాలను ఎత్తి చూపుతూ డెడికేషన్ కమిషన్‌కు వినతిపత్రం అందించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ కులాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ... బీఆర్‌ఎస్ లో బీసీలకు ప్రతినిధిగా మారిపోయారు. 

ఇక అన్ని ఎన్నికల్లో బీసీల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా..

జనాభాలో అత్యధిక భాగం ఉన్న బీసీలకు సర్వత్రా అన్యాయం జరుగుతోం దని, రాజ్యాధికారం వారికే రావాలని అన్ని పార్టీలు ఇప్పుడు తమ గళాన్ని వినిపిస్తున్నాయి. గతంలో సామాజిక న్యా యం నినాదంతో వచ్చిన పార్టీలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. కానీ ఇప్పుడు అన్ని ప్రధాన పార్టీల దృష్టంతా బీసీలపైన, వారి ఓట్లపైనే ఉండటం గమనించదగ్గ విషయం.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బీసీలకు రాజకీయంగా అవకాశాలు పెరిగే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీల హడావిడి చూస్తున్న బీసీలు కూడా తమకు సామాజిక న్యాయం జరిగితే చాలని ఎదురుచూస్తున్నారు.