calender_icon.png 8 October, 2024 | 8:10 AM

బీసీ గురుకులాలే నంబర్‌వన్‌గా ఉండాలి

08-10-2024 01:03:42 AM

గురుకులాల్లోనూ ఎంసెట్, నీట్ కోచింగ్

విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి

హాస్టల్ వార్డెన్ల ప్రమోషన్లపై త్వరలో నిర్ణయం  

బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాం తి): బీసీ గురుకులాలు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా చొరవ తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని కుమ్రంభీం భవన్‌లో బీసీ సంక్షేమ శాఖ విస్తృతస్థాయి అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సం దర్భంగా బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో కలిసి అధికారు లకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో గురుకులాల పనితీరుపై అధికారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారుల పనితీరు మెరుగుపర్చుకుని ఈ ఏడాది100 శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.

మెస్ ఛార్జీల పెంపు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రస్తుతం మోడల్ స్కూల్‌లో అమలవుతున్న మాదిరి గురుకులాల్లో కూడా పదో తరగతి ఉత్తీర్ణత సాధిం చిన వారు నేరుగా ఇంటర్‌కు వెళ్లేలా చూడాలని గురుకుల సెక్రటరీని ఆదేశించారు.

గురుకులాల్లో చదువుతున్న 8, 9, 10 తరగతి విద్యార్థులకు రెడ్‌క్రాస్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ప్రతి విద్యార్థి రెండు గ్రూపుల్లో ఉండేలా ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. అన్ని గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంసెట్, నీట్ కోచింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురుకుల సమస్యలపై ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా మంత్రి, ఎమ్మె ల్సీల నిధుల నుంచి కేటాయించేలా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. 

త్వరలో తల్లిదండ్రుల సమావేశాలు 

దసరా సెలవుల తర్వాత ఈ నెల 15 నుం చి 31వ తేదీలోపు ప్రతి గురుకులాల్లో పేరెం ట్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని, వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. దస రా పండుగలోపు అద్దె భవనాలకు 50 శాతం అద్దె చెల్లిస్తామని, యాజమానితో మాట్లాడి భవనాల్లో మౌలిక వసతులు కల్పించేలా చూడాలని ఆదేశించారు.

విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి గురుకులంలో బాక్స్ ఏర్పాటు చేసి ఆర్సీవో పరిశీలించాలని చెప్పారు. తమ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని, రూ.1,1౦౦ కోట్లతో 25 వేల పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించామని, 19 వేల మందికి ప్రమోషన్లు, 35 వేల మందికి బదిలీలు చేపట్టినట్టు వెల్లడించారు.

త్వరలో హాస్టల్ వార్డెన్ల ప్రమోషన్లపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయదేవి, గురుకుల సెక్రటరీ సైదులు, ఎంబీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్ కుమార్, బీసీ కార్పొరే షన్ ఎండీ మల్లయ్య బట్టు, అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్, జాయింట్ డైరెక్టర్ సంధ్య, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీ ఇంది రా, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.