calender_icon.png 7 April, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ గురుకుల ప్రవేశాల గడువు పొడిగింపు

01-04-2025 02:42:59 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): మహాత్మ  జ్యోతిబా ఫులే బీసీ గురుకులాలలో 2025 - 26 విద్యా సంవత్సరానికి 6 నుండి 9 వ తరగతి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్ లాక్ సీట్ల భర్తీ కోసం దరఖాస్తు గడువు ఏప్రిల్ 6 వరకు పొడిగించినట్లు  గురుకులాల జిల్లా కన్వీనర్ శ్వేత సోమవారం ప్రకటనలో తెలిపారు. ప్రవేశాల గడువు మార్చి 31 వరకు ప్రకటించినప్పటికీ గురుకుల ఉన్నతాధికారుల  ఆదేశానుసారం దరఖాస్తు గడువు పొడిగించినట్లు తెలిపారు.అర్హత కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.