calender_icon.png 3 April, 2025 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీసీ సంఘాల ధర్నా

02-04-2025 11:49:38 AM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీసీ పోరు గర్జన ధర్నా కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను ధర్నాకు బీసా సంఘాలు ఆహ్వానించాయి. వీరికి సంఘీభావంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, విప్ లు, బీసీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ బీసీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లపై తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఇప్పటికే తెలంగాణ శాసన సభలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలని, రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్ లో పెట్టి రాజ్యంగ రక్షణ కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.