16-04-2025 12:10:52 AM
జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
కామారెడ్డి , ఏప్రిల్ 15,(విజయక్రాంతి):కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని, రాష్ట్రాలు ఆమోదించిన బీసీ కులగణను కేంద్రం ఆమోదిం చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం ఆర్థిక రిజర్వేషన్లు కాదని సామాజిక రిజర్వేషన్లు కావాలని ఉందని బిజెపి ప్రభుత్వం అగ్రవర్ణాల కోసం ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ తీసుకువచ్చి సామాజిక రిజర్వేషన్లు చేయమంటే మోకాలు అడ్డుతుం దనరు.
ఢిల్లీలో ఇప్పటివరకు జరగని అతిపెద్ద బిసి పోరుగర్జనపై దేశం చర్చిస్తుంద న్నారు. ఈ పోరుగర్జనకు 18 రాష్ట్రాల ఎంపీలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి సైతం రెండు గంటల పాటు బీసీపూర్ గర్జనలో పాల్గొన్నారన్నారు.తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదించినప్పుడు ఏకగ్రీవంగా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని అందులో బీజేపీ సైతం ఉందని ఢిల్లీకి వెళ్లేసరికి ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం ఆ బిల్లును ప్రతిపాదించడం లేదని, బిజెపి నినాదం ఒకే దేశం, ఒకే న్యాయం, ఒకే ఎన్నికలు తదితర నినాదాలున్న బిజెపి రాష్ట్రాల్లో బిజెపి నాయకులు ఒప్పుకున్న కేంద్రంలో ఒప్పుకోకపోవడంపై బీజేపీ ద్వంద ధోరణి బయట పడుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏ తీర్మానం అయితే చేస్తారో ఆ తీర్మానాన్ని మూడు నెలల్లో గవర్నర్ ఆమోదించాలని సుప్రీంకోర్టు చరిత్నాత్మక తీర్పు ఇచ్చిందన్నారు. అంబేద్కర్ విగ్రహాలను పాలతో పాలాభిషేకం చేసిన నీళ్లతో కడిగిన అతని ఆశయాలు అమలు జరగనప్పుడు అవన్నీ వృధా అని, ఆశయాలను సాధించినప్పుడే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
భారత ప్రధాని తనకు ఎక్కడైనా అవమానం జరిగితే తాను బీసీ బిడ్డనని అందుకే అవమాన పరుస్తున్నారని అంటాడని అలాంటి వ్యక్తి తన బీసీల కోసం ఏం చేశారో ఒకసారి చెప్పాలన్నారు. కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చేనేత, గీత తదితర చేనేతలు లేనిదే ఏ కార్యక్రమమూ దేశంలో జరగదని అలాంటి బీసీ బిడ్డలని నేడు రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారన్నారు.
1000 మందితో జాతీయ క్లీనరిని ఏర్పాటు చేస్తాం..
బీసీల హక్కుల సాధన కోసం మీ మొదటి వారంలో హైదరాబాద్లో 1000 మందితో జాతీయ క్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆ తర్వాత ఢిల్లీలో ధర్మ యుద్ధ బేరీకి సంసిద్ధులమై బిసి హక్కుల కోసం పోరాటం చేయడం జరుగుతుందన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు,బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వనం గంగాధర్,రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ గౌడ్,ఉపాధ్యక్షులు మోహణాచారి,హజీజ్, మధు, భాస్కర్ గౌడ్,అంబెడ్కర్ సంఘం అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న,శ్రీనివాస్ గౌడ్, దాసరి గంగాధర్, హైమద్, రవి, విజయలక్ష్మీ,దయాకర్ తదితరులు పాల్గొన్నారు.