* బీసీ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు సుదర్శన్-----------------
కామారెడ్డి, జనవరి 18 (విజయక్రాంతి): బీసీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర బీసీ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు సుదర్శన్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కామారెడ్డి జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు చింతల శంకర్, బీసీ మేధావులు పాల్గొన్నారు.