- రిజర్వేషన్ల పెంపు తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
- బీసీల మహాధర్నాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ముషీరాబాద్, జనవరి 3: కాంగ్రెస్ పార్టీ బీసీలకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ల హామీ అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీల దామాషా ప్రకారం రిజర్వేషన్ల అమలు కోసం రాజ్యాంగ సవరణ చేయాలని ఆమె డిమండ్ చేశారు.
శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద తెలం జాగృతి ఆధ్వర్యంలో బీసీల మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 80కి పైగా బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సం హాజరయ్యారు. ముందుగా సావిత్రీబాయి పూలే చిత్రపటానికి నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ సంతకాల సేకరణ చేపట్టారు.
అనంతరం మహాసభలో కవిత మాట్లాడుతూ.. ఎటువంటి లోటుపాట్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని, లేదంటే బీసీ జనాభా ఎంత ఉంటే అంత వాటా ఇచ్చి ఎన్నికల్లోకి వెళ్లాలని అన్నారు. దొంగలెక్కలు, కాకిలెక్కలు కాకుండా వాస్తవ లెక్కలు తీయాలని అన్నారు.
మన ఉద్యమాల వల్లే సావిత్రీబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కవిత స్పష్టం చేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. 2011 కులగణన చేసిన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహిర్గతం చేయలేదన్నారు.
ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ కూడా కులగణన చేయబోమని స్సష్టం చేసిందని.. రెండు జాతీయ పార్టీలు బీసీలను మోసం చేశాయని అన్నారు. కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు న్యాయం చేశాయని అన్నారు.
ఈ మహాధర్నాలో ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకుడు ముఠా జైసింహ, యాదవ సంఘం నేతలు, బీఆర్‌ఎస్ నాయకులు వల్లాల శ్యామ్ యాదవ్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, రవి, రాష్ట్రంలోని పలు బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు గట్టు రాంచందర్, పల్లె రవి, ప్రశాంత్, జాగృతి సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.