నిజామాబాద్: స్థానిక సంస్థల రిజర్వేషన్లపై బీసీ కమిషన్ మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా రిజర్వేషన్ల ఖరారు, అభ్యర్థుల నుంచి బీసీ కమిషన్ బహిరంగ విచారణలో దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ లోని స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లపై బహిరంగ విచారణకు బీసీ సంఘాల నేతలు భారీగా తరలి వచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ విచారణ కొనసాగనుంది. కమిషన్ బృందానికి అర్జీలు ఇచ్చేందుకు ప్రజలు భారీగా వచ్చారు. సోమవారం ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో బీసీ కమిషన్ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ.. త్వరలో బీసీ కమిషన్ రిజర్వేషన్ ఖరారు చేస్తామని చెప్పారు. కాగా, నవంబర్ 13 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు బీసీ కమిషన్ వెల్లడించింది.