హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29(విజయక్రాంతి): హుస్సేన్‌సాగర్‌లో ఈనెల 26న జరిగిన బోటు ప్రమాదంపై బీసీ కమిషన్ సీరియస్ అయింది. దీనిపై మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు బుధవారం లేఖ రాసింది. ఫిబ్రవరి 1 సాయంత్రం 5గంటల లోపు లోపు నివేదిక ఇవ్వాలని లేఖలో పేర్కొంది. కాగా భారత మాతకు హారతి కార్యక్రమంలో ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.