హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను సోమవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆధ్వర్యంలో సభ్యులు కలిశారు. పలు కులాల పేరు మార్పుపై వచ్చిన అభ్యంతరాలతోపాటు తదితర అంశాలపె భట్టితో చర్చించారు. ఇప్పటికే బీసీ కమిషన్ 10 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి, కులాల పేరు మార్పుపై అభ్యంతరాలు, విజ్ఞప్తులను స్వీకరించింది.
అభ్యంతరాలపై బీసీ కమిషన్ సభ్యులు భట్టికి వివరించారు. బీసీ కమిషన్‌కు మరిన్ని అధికారాలు కల్పిస్తూ చట్ట సవరణ చేయాల్సిన విషయంపై కూడా ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి పాల్గొన్నారు.