calender_icon.png 8 January, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం చెప్పు చేతుల్లో బీసీ కమిషన్

03-11-2024 02:13:21 AM

బీఆర్‌ఎస్ నేత దాసోజు   

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రాష్ట్రంలో 95 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మోసం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కులగణనపై హైకోర్టు ఆదేశాలు అందలేదని బీసీ కమిషన్ చైర్మన్ చెప్పడం దుర్మార్గమన్నారు.

బీసీ కమిషన్ రేవంత్ చెప్పుచేతల్లో పని చేస్తుందని, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కులగణన చేస్తే ఏమైతుందని ప్రశ్నించారు. కులగణన చేసే బాధ్యత ఏ రాష్ర్ట ప్రభుత్వానికి లేదని, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, ఏదైనా చేయాలంటే చట్టాన్ని సవరించాల్సిందేనన్నారు.